39.2 C
Hyderabad
April 23, 2024 17: 33 PM
Slider సినిమా

సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను సందర్శించిన నాగపంచమి సీరియల్ బృందం

#nagapanchami

స్టార్‌ మా లో త్వరలో ప్రసారం కానున్న  నాగపంచమి సీరియల్‌ బృందం నేడు సైనిక్‌పురి, ఉప్పల్‌లలో  దేవాలయాలను సందర్శించింది. నాగదేవతగా పాములను కొలిచే మనిషి, ఆ పామును చూడగానే విష సర్పంగా భావించి చంపేయడానికి సిద్ధమవుతాడు. పగబట్టిన పాము, మనిషి బంధం చూపుతూ ఎన్నో కథలు చాలామందికి తెలుసు. సైన్స్‌ , అసలు పాములు పగబట్టవని , అదంతా ఉత్తిదే అని కొట్టి పడేస్తే, నమ్మకాలు  మాత్రం అబ్బే, పాములు పగబడతాయి, తమకు అనుభవాలున్నాయనే వారు కొందరు. పాములకు, మనుషులకు మధ్య ఈ పగ,ప్రతీకారాలేనా ? ఇంకేమీ లేవా ? అని అంటే చాలానే ఉన్నాయి.

ఆ బంధాలనే తాము చూపుతామంటూ స్టార్‌ మా వినూత్నమైన  కథనంతో నాగపంచమి సీరియల్‌తో వస్తుంది. పాలు పోసి కాపాడమ్మా అని నిర్మలమైన మనసుతో ప్రార్ధిస్తే చాలు  తానున్నాననే నాగదేవత కథనంతో తీర్చిదిద్దిన ఈ సీరియల్‌ స్టార్‌ మాలో మార్చి 27 నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతుంది. ఈ నేపథ్యంలో  సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా  భక్తుల  పూజలనందుకుంటున్న నాగేంద్రుని పలు ఆలయాలతో పాటుగా  అతి ముఖ్యమైన దేవాలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకుంది స్టార్‌ మా లో ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్‌ బృందం.

దీనిలో భాగంగా ఈ రోజున  హైదరాబాద్‌లోని  సైనిక్‌పురి వద్ద ఉన్న  శృంగేని శంకర మఠం లోని  శ్రీ విజయ గణపతి దేవాలయం తో పాటుగా ఉప్పల్‌ సమీపంలోని పోచారం వద్ద ఉన్న శ్రీ స్పటిక లింగేశ్వర ఆలయాలను సందర్శించింది ఈ బృందం. ఈ దేవాలయాలను దర్శించి,  భక్తులతో ముచ్చటించిన నాగపంచమి బృందం, ఈ నెల 27 నుంచి స్టార్‌మా లో ఈ సీరియల్‌ ప్రసారం కానుందని, గతంలో ఎన్నడూ  చూడని నాగదేవత కథతో ఇది ప్రసారం కానుందని వెల్లడించింది. స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఈ బృందం ఆదివారం కరీంనగర్‌, వరంగల్‌లలో ప్రముఖ దేవాలయాలను సందర్శించనుంది.

Related posts

విద్యాశాఖ మంత్రి దృష్టికి టీచర్ల సమస్యలు

Satyam NEWS

అక్క పెంచుకున్నకుక్కను చంపిన తమ్ముడు

Satyam NEWS

భౌతిక దూరం పాటించండి కరోనాను అడ్డుకోండి

Satyam NEWS

Leave a Comment