28.7 C
Hyderabad
April 25, 2024 04: 27 AM
Slider నల్గొండ

నాగార్జున సాగర్ లోని బుద్దవనం ఒక అద్భుతం

nagarjunasagar

శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా దేశాలకి చెందిన దేశాల పురాతత్వ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, చరిత్రకారులు సోమవారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని బుద్ధవనాన్ని సందర్శించారు.  గౌతమ బుద్దుడి పాదాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం బుద్ధవనంలోని మ్యుజియం, స్తూప పార్క్, ధ్యాన మందిరాన్ని వారు పరిశీలించారు. అక్కడి శిల్పకళను చూసి అబ్బుర పడ్డారు. అద్భుతమని ప్రశంసించారు. శని,ఆదివారాల్లో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్ఆర్డి) లో జరిగిన తెలంగాణ బౌద్ధ సంగితి -(బౌద్ధ పురావస్తు శాస్త్రంపై అంతర్జాతీయ సెమినార్) కార్యక్రమంకు హాజరైన ఈ ప్రతినిధులు తమ క్షేత్ర పర్యటనలో భాగంగా బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు.ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎస్ఈ క్రాంతిబాబు, ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, కన్సల్టెంట్ శ్రీనివాసన్, డిజైన్ ఇంచార్జి శ్యామసుందర్, ఏ ఈ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికార వైసీపీ షాక్

Satyam NEWS

వసతి గృహాలలో విద్యా ప్రమాణాలు పెంపుకు చర్యలు

Bhavani

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

Leave a Comment