ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ మాటలు అంటున్నద ఎవరో కాదు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిసరాలు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో మురికి నీటిని శుభ్రం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు.మురికి నీటి వల్ల దోమలు వృద్ధి చెందుతాయని, దీనివల్ల అనారోగ్య బారిన పడుతామన్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించి నాగ్..అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని సిబ్బందికి చెప్పడం జరిగిందన్నారు. మీ ఇల్లు, పని చేస్తున్న ప్రదేశాల్లో మురికి నీటిని తొలగించాలంటూ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో క్లీన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటిని..నీరు నిల్వ ఉండకుండా చేయాలని, క్లీన్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. దీంతో పలువురు నేతలు, ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు వారి వారి ఇంటిని క్లీన్ చేసిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు.
previous post
next post