28.7 C
Hyderabad
April 25, 2024 05: 29 AM
Slider గుంటూరు

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏం చేయాలి? నాగార్జున విసిని అడగండి

#NagarjunaUniversity

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏంచేయాలి? ఆ మాత్రం కూడా తెలీదా? జండా వందనం ఆ తర్వాత పోలీసు కవాతు ఉంటాయి. వీలైతే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

అంతే కదా? కాదు… అంతకు మించి… అంటున్నారు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ పాలకులు.

ఏం చేశారేంటి అని అడుగుతున్నారా? ఎంచక్కా జగనన్నపై పాట రాయించి విద్యార్ధులతో డ్యాన్సులు వేయించారు.

 భరతమాత, దేశభక్తి పాటలు వినిపించాల్సిన చోట జగన్ ను పొగుడుతున్న పాటలకు డ్యాన్సులు కట్టించడంపై జనం ముక్కున వేలేసుకున్నారు.

భరతమాత వేషంలో ఉన్న విద్యార్థినిని మధ్యలో నిల్చోబెట్టి.. జగన్ పాటలకు డ్యాన్సులు వేయించారు నాగార్జున యూనివర్సిటీ అధికారులు.

నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సెలర్ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది.

జగన్ పాటలు పెట్టడంతో అతిథులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థి సంఘాలు అవాక్కయ్యాయి.

Related posts

నూతన విద్యావిధానంపై హర్షం వ్యక్తం చేసిన తపాస్ జుక్కల్

Satyam NEWS

గుండెపోటు తో డీఐఈఓ మృతి

Bhavani

పులివెందుల భూకబ్జాలపై తిరగబడ్డ ప్రజలు

Satyam NEWS

Leave a Comment