39.2 C
Hyderabad
April 23, 2024 18: 05 PM
Slider గుంటూరు

నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు

#Nagarjunasagar Dam

ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దాంతో ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు గా ఉంది. పూర్తి సామర్ధ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 167.75 టీఎంసీలు ఉన్నాయి.

సాగర్ జలాశయంలోకి  500 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో సమానంగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లూ ఉంచారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈసారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గత ఏడాది కంటే ముందుగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఈసారి సాగర్ జలాశయంలో 40 టీఎంసీల నీరు అదనంగా ఉంది.

Related posts

మూడు రాజధానుల కోసం 101 టెంకాయలు కొట్టి పూజలు

Satyam NEWS

కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిన పెగాసస్

Satyam NEWS

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment