నల్లమల్లలో యురేనియం తవ్వకాలపై శాసన సభ లో సీఎం కేసీఆర్,శాసన మండలి లో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం పై నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడు రాములు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల మనసు తెలిసిన నాయకుడు,ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగానే నేడు శాసన సభ లో యురేనియం పై స్పష్టత నిచ్చారని ఆయన అన్నారు. ఇప్పటివరకు నల్లమల్ల లో ఎక్కడ యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని మరోమారు సభ సాక్షిగా చెప్పారని ఇది హర్షణీయమని ఆయన అన్నారు. అవసరం అయితే సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం అని చెప్పడం గొప్ప నిర్ణయం అని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా అనవసర ఆరోపణలు మానుకోవాలని కోరుతున్నానని రాములు తెలిపారు.