యురేనియం తవ్వకాల పై ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని శాసన సభ లో తీర్మానం చేసిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కలిసి నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ రాములు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలకు టీఆరెస్ ప్రభుత్వం దూరం ఉంటుందని ఈ సంఘటనతో మరోమారు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని రాములు అన్నారు. గత కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర ఆరోపణలు చెంపపెట్టుగా ఈరోజు సభలో తీర్మానం చేశారని, ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు యురేనియం పై కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. సమయం వచ్చినప్పుడల్ల పార్లమెంట్ ఈ విషయంపై మాట్లాడాలని మంత్రి కేటీఆర్ ఎంపి రాములుకు సూచించారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకించే సమయంలో ప్రతిపక్ష ఎంపీ తమతో కలిసి రావాలని కోరుతున్నట్లు రాములు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నాగర్ కర్నూలు లోక్ సభ నియోజక వర్గం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
previous post