32.2 C
Hyderabad
March 29, 2024 21: 26 PM
Slider మహబూబ్ నగర్

పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

#Collector Sharman

గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం సాధించగలుగుతామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంతో పాటు కొండనాగుల, బల్మూర్, లింగాల గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటన జరిపారు.

అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్ల వెంబడి కొన్ని ఖాళీ ప్రదేశాలలో అధికంగా చెత్త  ఉంటుందని  కలెక్టర్ గుర్తించి సదరు దుకాణదారులు వాటిని పరిశుభ్రంగా  ఉంచుకునేలా  నోటీసులు జారీ చేయాలని,  వారి  కారణంగా పట్టణ ప్రజలు అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.

పట్టణ వాసులంతా  ఐక్యమత్యంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్చత కార్యక్రమానికి సహకరించని వారిని  గుర్తించి వారికి అవసరమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వార్డులో ఒక గ్రీన్ పార్క్ వుండాలని, ప్రతి 5 వార్డులకు 1 నర్సరీ ఉండాలన్నారు.

రుణ సదుపాయాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలి

పట్టణంలో రోడ్ల వెంబడి ఉండే చిరు వ్యాపారస్తుల తో కలెక్టర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వీధి విక్రయదారులు లకు 10000 రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తుందని వీధి విక్రయదారులు  ప్రతి ఒక్కరూ విధిగా సద్వినియోగ పరుచుకోవాలన్నారు.

అనంతరం కొండనాగుల, బల్మూర్, లింగాల గ్రామాల్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ హిందూ స్మశాన వాటికలు రైతు వేదికల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులతో కలెక్టర్ మాట్లాడుతూ  స్వచ్చత మన జీవిన విధానంలొ భాగం  కావాలని,  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని  కలెక్టర్  తెలిపారు.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాలో నీటి నిల్వ లేకుండా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కురిసే ప్రతి నీటి చుక్కను మనం  నిల్వ చేసుకోవాలని, దానికి అవసరమైన ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు ఇతర అధికారులు ఉన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వం వేధింపులు ఆపకపోతే వచ్చికూర్చుంటా

Satyam NEWS

హుజూర్ నగర్ శాఖ గ్రంథాలయానికి గ్రంధాలు బహుకరణ

Satyam NEWS

కరోనా వేళ…నిబంధనల మధ్య ఆది శంకరుల జయంతి

Satyam NEWS

Leave a Comment