27.7 C
Hyderabad
April 26, 2024 03: 41 AM
Slider మహబూబ్ నగర్

ఆంధ్రుల జల దోపిడీ ఆపాలంటూ ఆర్డీవో కు వినతి పత్రం

#Nagarkurnool Congress

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు నుండి కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమ ప్రాంతానికి తరలించకుండా ఆపాలని  కల్వకుర్తి ప్రజల పక్షాన  కాంగ్రెస్ నాయకులు కల్వకుర్తి ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు.

2015 లో ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం ని తెలంగాణ ప్రభుత్వం వివక్ష పూర్వకంగా సగానికి సగం తగ్గించడానికి సమంజసం కాదని వారు ఆరోపించారు. కాళేశ్వరం పై ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి పై దయ లేదని పాలమూరు రైతాంగం పై వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

అదే విధంగా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించబడిన  కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని తక్షణమే  కల్వకుర్తి ఎత్తిపోతల పనులను పూర్తిచేసి  కల్వకుర్తి రైతాంగాన్ని ఆదుకోవాలని , 203 జీవో రద్దు చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగవంతం చేసి,దాని సామర్థ్యాన్ని 2 ఎంసీలు చేయాలని కల్వకుర్తి ఎత్తిపోతల కాంక్రీట్ పనులు పూర్తి చేయాలంటూ పాలమూరు రైతాంగ పై ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలనే 5 డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని  అందజేశారు. ఈ కార్యక్రమంలో లో కాంగ్రెస్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ కౌన్సిలర్ ఎజాస్, పసుల శ్రీధర్ రెడ్డి ,మిరియాల శ్రీనివాస్ రెడ్డి, చిన్న, చంద్రకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెలకుర్రు గొల్లపాలెం గ్రామంలో శ్రీకృష్ణ శిలావిగ్రహ ప్రతిష్టాపన

Bhavani

వ్యాపారవేత్త జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి

Satyam NEWS

రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

Satyam NEWS

Leave a Comment