35.2 C
Hyderabad
April 24, 2024 12: 25 PM
Slider మహబూబ్ నగర్

హరితహారంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు

nagarkurnool police

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్.పి. డాక్టర్ వై సాయి శేఖర్  అదేశాల మేరకు ఈరోజు  హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు, ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని  ఎస్.పి. డాక్టర్ వై సాయి శేఖర్ జిల్లా పోలీస్ సిబ్బందికి  అదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాలలోనూ ఈరోజు మొక్కలు నాటారు.  పోలీసు శాఖ పక్షాన హరితహారంలో నాటిన ప్రతి మొక్కను రక్షించుకున్నామని, ఇందులో తమ సిబ్బంది శ్రద్ధ  పట్ల ఎస్ పి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీఅనోక్ జయకుమార్, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలియజేశారు.

ఇలా చేయగలిగితేనే మన చుట్టూ ఉండే పరిసరాలు ఇప్పుడు ఉన్న దాని కంటే ఎక్కువ పచ్చగా మారుతాయని, ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా భావించి మన భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం లో పాటు పడాలని సూచించారు.  అదేవిధంగా   డి ఎస్పి మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత విడతలలో జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలను నాటి అన్ని శాఖల కన్నా ఎక్కువ పేరును సంపాదించామని అన్నారు.

ఇప్పుడు మొదలైన హరితహారంలో కూడా అధికారులు, సిబ్బంది భాద్యతగా స్వీకరించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు.  అదేవిధంగా ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ మాట్లాడుతూ  మొక్కలను పెంచడం ద్వారా ఎంతో మేలు కలుగుతుందని, అవి పెరిగిన తర్వాత నీడనిస్తాయని, అదేవిధంగా రైతులు పంటలు పండించుకోవడానికి వర్ష పరిస్థితులను కూడా చెట్లు కలిగిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్,  ఆర్.ఐ  నారాయణ రాజు, ఎఆర్ ఎస్.ఐ  తిరుపతి,  ఎస్.ఐ  శ్యాము, ఐ.టి కోర్ సిబ్బంది   ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది హాజరయ్యారు.

Related posts

భారత్ లో భారీగా గూగుల్ పెట్టుబడులు

Satyam NEWS

‘దేశం’ తో కలిసిన వారాహీ యాత్రతో జగన్ గుండె గుభేల్

Satyam NEWS

పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగిన అమితాబ్‌

Sub Editor

Leave a Comment