ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై .సాయి శేఖర్ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ఇచ్చే మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా పాటింస్తూ, మన దేశంలో కరోన వైరస్ వ్యాపిని అరికట్టవచ్చునని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో నేడు జనతా కర్ఫ్యూ విజయవంతంగా నిర్వహించిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ భగవంతుని పనిలో భాగం పంచుకున్నట్టుగా సేవచేస్తున్న వైద్యులకు, పగలు రేయి తేడా లేకుండా పరిధి కి మించి కష్టపడుతూ అందరికీ చేరువలో ఉన్న పోలీసులకు, పరిశుభ్రతే పరమపదంగా భావించి పరమాత్మునికి సైతం ప్రాణం పోస్తాం అన్న రీతిలో సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆయన చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియచేశారు.
అదే విధంగా సమాచారాన్ని సత్వరమే తెలుపుతూ అందరినీ జాగరూకత ప్రదర్శించేలా పరితపిస్తున్న పాత్రికేయులకు ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతీ నిమిషమూ పరుల కోసమే కేటాయిస్తూ అనేక చర్యలు,సపర్యలు చేస్తూ చేయిస్తున్నప్రతి ఒక్కరికి ఆయన క్యాంపు ఆఫీస్ నుండి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై .సాయి శేఖర్ తో బాటు కలెక్టర్ ఇ . శ్రీధర్ జిల్లా పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.