ఎస్ఎన్ డీపీ పనుల జాప్యంతో కాలనీలు మునిగిపోతున్న అధికారులకు పట్టింపు లేకుండా పోయిందనీ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎంపీఆర్ కాలనీ వాసులతో కలిసి టీవీ కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రామంతాపూర్ పెద్ద చెరువు నుండి వరద నీరు తరలించేందుకు టీవీ కాలనీలో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి నిర్మాణం పనులు చేస్తున్న పైపు లైన్ అధికారులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రాత్రి కురిసిన వర్షంతో టీవీ కాలనీ జలమయం అయిందన్నారు. పగిలిన మంచినీటి పైపులైన్ వెంటనే పునరుద్ధరించాలని హెచ్ ఎం డబ్లు ఎస్ అధికారులను కోరారు.
మున్సిపల్ అధికారులతో మాట్లాడి వెంటనే పనులను పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రాత్రి నుంచి నిలిచిపోయిన సరఫరాను పునరుద్ధరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సత్తిరెడ్డి ,భవాని ,రాఘవీర్ ,అనిల్ కుమార్ ,లక్ష్మణ్ రావు ,గణేష్ చారి ,ఉదయ్ ,రాజు ,ఇందుమతి ,శివకుమార్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ ,లూకాస్ ,ఉపేందర్ రెడ్డి ,సందీప్ ,భాస్కర్ ,కోటేష్ ,వంశీ యాదవ్ ,బాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి