Slider నల్గొండ

పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు

#Nalgonda SP Meeting

నల్లగొండ జిల్లా దామరచర్ల లోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో పని చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు లాక్ డౌన్ కన్నా ముందు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు, వారి ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.

బుధవారం దామరచర్ల పవర్ ప్లాంట్ కార్మిక సంఘాలు, కార్మికులు, కాంట్రాక్టర్లు, జెన్ కో, రెవెన్యూ అధికారులతో కలిసి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలస కార్మికుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం ప్రెస్ మీట్ లో చేసిన ప్రకటన వీడియో క్లిప్పింగును కార్మికులందరికి మరోసారి ఎస్పీ చూపించి వారిని స్వస్థలాలకు పంపించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

స్వరాష్ట్రానికి వెళ్లే ఆలోచనపై సందిగ్దత

అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తుదిదశకు చేరుకున్నదని మరో కొద్ది రోజుల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులున్నాయని ఇప్పటికే కేంద్రం అనేక సడలింపులు ఇచ్చిందని అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని ఈ దశలో కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించాలని ఎస్పీ కోరారు.

ఎస్పీ రంగనాధ్ చెప్పిన మాటలతో కొంత ఆలోచనలో పడిన సగానికి పైగా కార్మికులు తాము ఆలోచించుకొని నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. ఖచ్చితంగా స్వస్ధలాలకు వెళ్లాలనుకునే వారిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లలో పంపించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.

లాక్ డౌన్ కన్నా ముందు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

అదే సమయంలో కొందరు కార్మికులు లాక్ డౌన్ కన్నా ముందు  తమకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే సంబంధిత కాంట్రాక్టరులతో ముఖాముఖి నిర్వహించి రెండు రోజులలో వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలిపారు.

సంబంధిత కాంట్రాక్టర్లు వేతనం చెల్లించకపోతే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెండు నెలల తర్వాత స్వంత ఖర్చులతో కార్మికులను వారి స్వంత ప్రాంతాలకు పంపించేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

కాంట్రాక్టర్లు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, రూరల్ సిఐ రమేష్ బాబు, జెన్ కో అధికారులు, రెవిన్యూ అధికారులున్నారు.

Related posts

సత్యం న్యూస్ ముందే చెప్పింది: వీఆర్వో వ్యవస్థ రద్దు

Satyam NEWS

జూన్ 8 నుంచి తెలంగాణ ఆలయాల్లో భక్తులకు ద‌ర్శ‌నాలు

Satyam NEWS

ఓ పాలకులారా… ఈ గ్రామాన్ని చూసి సిగ్గుపడండి

Satyam NEWS

Leave a Comment