38.2 C
Hyderabad
April 25, 2024 12: 43 PM
Slider మహబూబ్ నగర్

రెడ్ కార్నర్: నల్లమల అడవిని కొల్లగొడుతున్న క్వార్జ్ దొంగలు

singotam temple

ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సింగోటం రత్న లక్ష్మి దేవస్థానం భూముల్లో క్వార్జ్ త్వకాలకు తెరలేచింది. నల్లమల అటవీ ప్రాంతంలోని రత్నగిరి కొండపై వెలసిన రత్న లక్ష్మి ఈ దారుణాన్ని చూస్తూ తల్లడిలిపోతున్నది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు పది కిలోమీటర్ల దూరంలోని ఈ దట్టమైన అడవిలోని వన్య ప్రాణులు అలో లక్ష్మణా అంటూ చనిపోయే పరిస్థితి దాపురించింది.

సింగోటం, ఎన్ మన్ బెట్ల, కల్వకోల్, జవాయి పల్లి గ్రామ ప్రజలు ఈ అన్యాయంపై పోరాటం చేస్తున్నారు. దీనికి సింగోటం స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. పవిత్ర దేవాలయం, ఆనుకుని ఉన్న ప్రకృతి సంపద, వన్య ప్రాణులు, నీటివనరులు నాశనమైపోయే పరిస్థితి నుంచి తమను కాపాడాల్సిందిగా వారు లోకాయుక్తను ఆశ్రయించారు. దాంతో లోకాయుక్త నిజనిర్ధారణ కమిటీని నియమించింది.

లోకాయుక్త నిజనిర్ధారణ కమిటీ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి విస్మయం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు రిపోర్టులో ఉన్నదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి పొంతన లేకపోవడాన్ని లోకాయుక్త నిజనిర్ధారణ కమిటీ గుర్తించింది. తవ్వకాలు జరిపే స్థలానికి 500 మీటర్ల దూరంలో పంట పొలాలు నీటి వనరులు ఉండరాదనే నిబంధన ఉండగా ఇక్కడ కేవలం 59 మీటర్ల దూరంలోనే సర్వే నెంబర్ 328, 329 లలో పంట పొలాలు ఉన్నాయి.

తవ్వకాలు జరిపే ప్రాంతంలో ప్రాచీన కట్టడాలు, ప్రాముఖ్యత గలిగిన కట్టడాలు ఉండరాదని నిబంధన ఉండగా ఇక్కడ బొల్లి గట్టు (రత్నగిరి కొండ) పైన రత్నమాంబ ఆలయం ఉంది. అదే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, శ్రీవారి సముద్రం ఉన్నాయి. ఎత్తంగట్టు కిలోమీటరు దూరంలో ఉందని దగ్గరలో అడవులులేవని ప్రభుత్వం పేర్కొన్నది కానీ తవ్వే స్థలమే అటవీ ప్రాంతం.

ఈ గట్టు అంతా అటవీ ప్రాంతమే కాకుండా ఈ గట్టు పొడవు మొత్తం అంటే కిలోమీటరు పొడవునా దట్టమైన చెట్లు ఉన్నాయి. దాదాపు ఒకటిన్నర టిఎంసి నీటి నిల్వ ఉండే ఈ సింగోటం చెరువుకు కట్ట సహజసిద్ధంగా ఏర్పడింది. ఈ సహజ సిద్ధ కట్టపైన దట్టమైన అడవి ఉంటుంది. అందులో లక్షలాది వన్యప్రాణులు ఉంటున్నాయి.

ఈ తవ్వకాలను ఆపాల్సిందిగా సింగోటం, ఎన్ మన్ బెట్ల, కల్వకోల్, జవాయి పల్లి గ్రామ ప్రజలు రైతులు, మత్స్యకారులు నిరసన తెలిపారు. సింగోటం స్వచ్ఛంద సేవా సంస్థ 2017 జులై 6న ఈ విషయాన్ని ఎంఆర్ఓ, కలెక్టర్ దృష్టికి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లింది. అయినా వారు స్పందించలేదు. దాంతో లోకాయుక్త దృష్టికి తీసుకువెళ్లగా ఈ నెల 19న నిజనిర్ధారణ కమిటీ ని పంపారు.

ఆ కమిటీ తవ్వకాలు జరిపే ప్రాంతానికి వచ్చింది. రెండు రోజుల పాటు వారు ఈ ప్రాంతాన్ని పరిశీలించి తవ్వకాలు జరిపే ప్రాంతానికి అతి సమీపంలో చెరువు, బొల్లిగట్టు అటవీ ప్రాంతం, వన సంపద అధికంగా ఉన్నట్లు గమనించారు. ఈ  ప్రాంతంలోని బొల్లిగట్టు లో క్వార్జ్ క్రిష్టల్స్ అధికంగా ఉన్నట్లు అంచనా వేసి తవ్వుకోవడానికి ఒక ప్రయివేటు కంపెనీకి అనుమతి ఇచ్చారు.


లోకాయుక్త నిజ నిర్ధారణ కమిటీ పర్యటన దృశ్యం

తవ్వకాలు ప్రారంభిస్తే ఈ ప్రాంతం అంతా అడవి నాశనం అవుతుంది. హరిత హారం పేరుతో ఒకటో రెండో చెట్లు పెట్టుకుంటూ ఫొటోలు తీయించుకునే నాయకులు అడవులను నాశనం చేయడాని అనుమతులు ఇస్తే ఎలా? పుడమి  తల్లిని నమ్ముకుని బతికే బడుగు జీవులు ఈ ప్రశ్న వేస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సింది మాత్రం హరిత హారం పేరుతో మొక్కలు నాటే నాయకులే. తమ ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని, క్వార్జ్ మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని సింగోటం స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు బి బాల్ రెడ్డి కోరుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువు, వన్య ప్రాణులు, సాగు చేసుకునే రైతులను కాపాడేందుకు క్వార్జ్ మైనింగ్ ను నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు.

Related posts

కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్ధులను అభినందించిన ఎస్పీ

Satyam NEWS

జ్ఞాన్వాపి మసీదు లోని శివలింగాన్ని పూజించే అవకాశం కల్పించండి

Satyam NEWS

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Murali Krishna

Leave a Comment