28.2 C
Hyderabad
April 20, 2024 12: 30 PM
Slider జాతీయం

కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో నమాజుపై నిషేధం

#kutubmeenor

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో మతపరమైన కార్యక్రమాలను నిషేధించారు. దాంతో ఇక అక్కడ ముస్లింలు నమాజ్ చేయలేరు. కుతుబ్ మనీర్ నిర్జీవ స్మారకం అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖచ్చితంగా స్పష్టం చేసింది. అందువల్ల ఈ ప్రాంగణంలో మతపరమైన కార్యకలాపాలు నిషేధించారు.

ASI అధికారుల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇటువంటి నిర్జీవ స్మారక కట్టడాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక్కడ పూజలు, ప్రార్థనలు అనుమతించబడవు. అయినప్పటికీ ఇంతకాలం కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో నమాజ్ చేసేవారు. ఇప్పుడు ఇక్కడ నమాజ్ చేయకూడదని నిషేధించారు.

ఏఎస్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుతుబ్‌మినార్‌ ప్రాంగణంలో నమాజ్‌ చేయాలంటూ కొందరు పట్టుబడుతున్నారని, వారికి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ASI ఆధీనంలోని స్మారక స్థలంలో మతపరమైన కార్యకలాపాలకు చట్టబద్ధంగా అనుమతి లేదని ASI అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు, ఫిరోజ్ షా కోట్లా స్మారక ప్రదేశంలో నమాజ్‌ను కూడా ASI నిషేధించింది.

Related posts

ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు

Bhavani

విజయవాడలో రెడ్డిపేట తండా వాసి మిస్సింగ్

Satyam NEWS

సీఎం జగన్ నిరుద్యోగుల ద్రోహి.. జాబ్ క్యాలెండర్ కోసం అంబేద్కర్ కు వినతిపత్రం..!

Satyam NEWS

Leave a Comment