30.3 C
Hyderabad
April 16, 2021 12: 51 PM
Slider కృష్ణ

కృష్ణా జిల్లా కు నందమూరి తారక రామారావు పేరు పెట్టాలి

#NTRamarao

కృష్ణా జిల్లా కు నందమూరి తారక రామారావు  పేరు పెట్టాలని ఎన్ టి ఆర్ అభిమాని లకిరెడ్డీ బాలిరెడ్డి కళాశాల ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాద యాత్ర లో తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కృష్ణా జిల్లా కు మాజీ ముఖ్యమంత్రి , స్వర్గీయ నందమూరి తారక రామారావు పెడతామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

ఆ రోజుల్లో రాముడిగా, కృష్ణుడిగా,  సమాజం లోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యం కలిగించే ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు సేవ చేశారని శ్రీనివాస రెడ్డి గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేద,మధ్య తరగతి కుటుంబాలకు, ఫీజ్ రియంబర్స్ మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆయన  కోట్లది మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు వారు అందరు అన్న అని పిలుచుకొనే స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు ను కృష్ణా జిల్లా కు పెట్టాలని ఆయన అభిమానిగా శ్రీనివాసరెడ్డి కోరారు.

Related posts

మీడియా క్రియేషన్ : నేనా సి.ఎమ్మా ఎపుడు ఏకడా

Satyam NEWS

ఈ రెడ్డి బాబులు..ఉద్యోగ సంఘనేతలా ! అధికార పార్టీ సేవకులా ?

Satyam NEWS

నందలూరు రైల్వేలో కోవిడ్19 ఐసోలాషన్ వార్డ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!