24.7 C
Hyderabad
March 26, 2025 10: 31 AM
Slider శ్రీకాకుళం

థియేటర్ వర్కర్స్ ను ఆదుకున్న నందమూరి ఫ్యాన్స్

#Balakrishnafans

కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకొని  వారికి అండగా ఉంటామని శ్రీకాకుళం జిల్లా తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవాధ్యక్షులు, నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. నేడు  శ్రీకాకుళం నగరం లో సినీ థియేటర్స్ సూర్య మహల్, సన్ మాక్స్, మిత్రా (మారుతీ), రామకృష్ణ థియేటర్ వర్కర్స్ కు ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో  పనులు లేక ఆదాయం రాక చాలా వర్గాల ప్రజలు పస్తులుంటున్నారని ఇటువంటి సమయంలో వారి కష్టాలలో పాలుపంచుకోవాలని తాము ఇలా చేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వలన చాలా వర్గాల ప్రజానీకం బాధలు పడుతున్నారని వారిలో సినీ థియేటర్స్ వర్కర్స్ కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

నందమూరి అభిమానులుగా తమ బాధ్యతగా శక్తి మేరకు సాయం చేస్తున్నామని అన్నారు. థియేటర్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికి 8 వస్తువులతో కూడిన నిత్యావసర వస్తువుల కిట్స్ అందించామని ఆయన తెలిపారు. తమ సేవా సంఘం తరపున ఇంకా చేయాలిన  కార్యక్రమాలు ఉన్నాయని అవకాశం మేర చేస్తామని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమం లో జిల్లా బాలయ్య బాబు ఫాన్స్ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ , కోశాధికారి సురకాశి వెంకటరావు, జిల్లా  ఫాన్స్ అధ్యక్షులు దుంగ శ్రీధర్, జిల్లా హరికృష్ణ సేన అధ్యక్షులు లొట్టి సూరిబాబు జిల్లా నందమూరి తారకరామా &  మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు డేవిడ్ పాల్గొన్నారు

ఇంకా ప్రతినిధులు , సురేంద్ర, సాయిమోహన్ , శ్రీకూర్మం రమణ,  సతీష్ ,నీలు, ,సోమేశ్ ,దేవా  తారక్ , ఎర్రన్నాయుడు ,దుర్గా మణి,  అలాగే సూర్యమహల్ స్టాఫ్ రమేష్ నాగభూషణం, సన్ మాక్స్  స్టాఫ్ , వెంకటరావు ,రామకృష్ణ స్టాఫ్  మధు కూడా పాల్గొన్నారు.

Related posts

కొత్త పే స్కేల్ తోనే ఏపి ఉద్యోగులకు వేతనాలు

Satyam NEWS

పురుగు కుట్టి ఆరుగురు హాస్టల్ బాలికలు సీరియస్

Satyam NEWS

ఆర్దిక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన అప‌ర చాణుక్య‌డు..మాజీ ప్ర‌ధాని పీవీ

Satyam NEWS

Leave a Comment