30.2 C
Hyderabad
September 14, 2024 15: 53 PM
Slider సినిమా

ఎంత మంచి వాడవురా టీజర్ అదుర్స్

kalyanram

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ఎంత మంచి వాడవురా చిత్రం టీజర్ విడుదల అయింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ క్రేజీగా ఉంది. ఎంత మంచి వాడవురా అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెబుతున్న ఈ టీజర్ చిత్రం పై మరింత ఆసక్తి రేపుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కళ్యాణ్ రామ్ సరికొత్త ఎమోషనల్ ఫ్యామిటీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిటీ ఆడియన్స్ ను మెప్పించిన సతీష్ ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నారు. తన స్టైల్ లోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సతీష్ ఈ సారి డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఉమేష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నారు. అందాల నాయిక మెహరీన్ హీరోయిన్ గా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటిస్తున్నది. శివలెంక కృష్ణ ప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

Bhavani

సెక్స్ పిచ్చోడిని అంతం చేసిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

ఈటల రాజేందర్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment