118తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్నచిత్రం ఎంత మంచివాడవురా. మెహరీన్ కథానాయికగా నటిస్తున్నది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాతలు. ‘శతమానం భవతి ‘చిత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత ఉమేష్ గుప్త మాట్లాడుతూ ఎంతమంచివాడవురా టైటిల్ ప్రకటించినపుడు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటీవ్ వైబ్స్ తో అనుకున్న ప్లానింగ్ లో చిత్రీకరణ జరుగుతున్నది. గీత గోవిందం, మజిలీ తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్నిఅందించిన గోపీ సుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు.జూలై 31న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాం. ఈ నెల 17 నాటికి తొలి షెడ్యూల్ పూర్తి అయింది 26 నుంచి సెప్టెంబర్ 27 వరకూ రెండో షెడ్యూల్ ను చిత్రీకరిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాను తీర్చిదిద్ది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నటీనటులు:నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, వి.కె.నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
నిర్మాతలు : ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త,
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,సినిమాటోగ్రఫీ:
రాజ్ తోట
సంగీతం: గోపీ సుందర్,ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: రామాంజనేయులు,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ ఖాన్