28.2 C
Hyderabad
April 20, 2024 12: 55 PM
Slider కర్నూలు

విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నది….. అనుకుంటున్నారా?

#nandyala

విద్యుత్ కాంతులతో నంద్యాల వెలిగిపోతున్నది అనుకుంటున్నారా? ఇవి అందాలు కాదు మురుగు నీటి కాల్వలు. రాత్రి వేళల్లో ఇలా కనిపిస్తున్నాయి. అధికారులు, నాయకులు ఇప్పటికైనా నంద్యాలలో కాల్వల్లో పూడికలు తీయిస్తారో లేదో, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుతారో లేదో…. తెలియదు.

పాపం కౌన్సిలర్లు సమస్యలపై ప్రశ్నిద్దామంటే బెల్ కొట్టి సమావేశం ముగిస్తున్నారు. కౌన్సిలర్ల దుస్థితి పగవాడికికూడా వద్దు. ఒకొక్క కౌన్సిలర్ అర కోటి డబ్బు ఖర్చుపెట్టి కౌన్సిలర్లుగా గెలిచినారే తప్ప వార్డుల్లో ఒక్క చిన్న పనికుడా చేయించుకోలేకపోతున్నారు.

కొత్తవారు సరే, పాతవారి పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వార్డుల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక కొందరు కౌన్సిలర్లు ముఖం చాటేసుకొని తిరుగుతున్నారు. నలుగురు తెలుగుదేశం, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం మైకు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి. ఆ వార్డుల్లో మున్సిపాలిటికి అధికంగా ఇంటి పనులు, కుళాయి పన్నులు అధికంగా వసూలు అవుతాయి.

పన్నులు చెల్లిస్తున్నా ఆ వార్డుల్లో అధికార పార్టీ కౌన్సిలర్లు కాకపోవడంతో నేటి వరకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోవడం దారుణం. ఆ వార్డులపై కక్ష సాధించే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది. 2004 నుంచి ఆ కుటుంబసభ్యులకు ఓట్లు వేసి గెలిపిస్తే,ఒక్క సారి ఇతర పార్టీ నాయకులను గెలిపించడం ఆ వార్డుల్లోకి ప్రజల దురదృష్టం లాగా కనిపిస్తున్నది. ఈ రోజు సాయంత్రం ఒక గంట పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణమంత మోకాళ్ళ మురుగునీటిలో దర్శనమిచ్చింది.

శ్రీనివాసనగర్ నుంచి సంజీవనగర్ గేటు వరకు రెసిడెన్షియల్ ప్రాంతాల్లో యథేచ్ఛగా కమర్షియల్ కాంప్లెక్స్ లు కడుతూ కాల్వలు ఆక్రమించి కట్టడాలు కడుతున్నా పట్టణ ప్రణాళికా విభాగం మామూళ్లు భారీగా తీసుకుంటూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.

ప్రశ్నిస్తే రాజకీయ వత్తిళ్ళు అంటూ దాటవేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఎన్నో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కడుతున్నా లక్షలు లంచాలు తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యాలయాలకు పరిమితమవుతున్నారు. ప్రధానంగా నంద్యాల లో మురుగు నీరు రావటానికి ప్రధాన కారణం టౌన్ ప్లానింగ్ అధికారుల ధన దాహానికి 2 లక్షల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Related posts

జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Satyam NEWS

జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు

Bhavani

జేడీ లక్ష్మీనారాయణా? నీ అడుగులు ఎటు?

Bhavani

Leave a Comment