దళిత ఎంఎల్ఏ ఉండవెల్లి శ్రీదేవిని కులం పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మినేని కుటుంబీకులు తిట్టి వినాయకచవితి మండపం నుంచి వెళ్లగొట్టిన కేసును మరువక ముందే టీడీపీ నేత నన్నపనేని రాజకుమారిపై అదే తరహా కేసు నమోదయ్యింది. ఎస్సై అనురాధ ఫిర్యాదుతో రాజకుమారిపై 303, 506,509 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను కులం పేరుతో దూషించడమే కాక విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై అనురాధ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నన్నపనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం చలో ఆత్మకూరు పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబును కలిసేందుకు వస్తున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే అనితలు బాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసుల్ని వారిని అడ్డుకొని అరెస్ట్ చేయడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారంటూ మహిళా ఎస్సై అనురాధ ఆరోపించారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని అలా మాట్లాడడం సరికాదని ఎస్సై మండిపడ్డారు. ఆమె విధుల నుంచి వెళ్లిపోయారు. తనపై చేసిన ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
previous post
next post