39.2 C
Hyderabad
March 29, 2024 13: 46 PM
Slider తెలంగాణ

తెలంగాణలో టిడిపిని బతికిద్దాం రండి

Nannuri Narisireddy

తెలుగుదేశం పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణంతో ముందుకెళ్దామని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకులు నన్నూరి నర్సిరెడ్డి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం హన్మకొండ భవానీనగర్లోని ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమై నర్సిరెడ్డి తో పాటు మరో పరిశీలకులు ఇల్లందుల రమేష్ లు సమీక్షించారు. 

క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, గ్రామ, వార్డు, డివిజన్, మండల, పట్టణ కమిటీల వివరాలు హాజరైన నాయకుల కార్యకర్తల నుండి అడిగి తీసుకున్నారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ పార్టీని వీడిన వారిని మర్చిపోవాలని ఉన్నవాళ్లం పార్టీకోసం ఏం చేద్దామనేది మన ముందున్న కర్తవ్యమని అన్నారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన పార్టీ అని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ సామాజిక ఆర్థిక చైతన్యం కల్పించిన పార్టీ అని, అటువంటి పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని నర్సిరెడ్డి అన్నారు.

తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగా రాష్ట్రంలోని 17పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహించి పనిచేసే నాయకత్వాన్ని గుర్తించి కొత్త కమిటీలలో అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా ప్రస్తుత కమిటీలన్నీ రద్దు చేసి అడ్ హాక్ కమిటీలను ఎన్నిక చేసుకోవడం జరుగుతుందని జిల్లా పార్టీ కమిటీ స్థానంలో పార్లమెంట్ స్థాయి కోఆర్డినేషన్ అడ్ హాక్ కమిటీని ఎంపిక చేస్తారని ప్రతి శనివారం ముఖ్య నాయకులతో చర్చించి నారా చంద్రబాబు నాయుడుగారు పార్టీ పటిష్టతకు నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. 

ప్రజాబలం, నాయకత్వ లక్షణాలు, పార్టీకి చేసిన సేవలు, పార్టీ పట్ల విధేయత అంకితభావం, ప్రజా సమస్యలపై అవగాహన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే సమర్థత,పార్టీ చేపట్టనున్న ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే వారిని, పార్టీకి పూర్తి సమయం కేటాయించగలిగే సమర్దులైన నాయకులను ఎంపిక చేసుకోని సమిష్టిగా సమన్వయంతో ఆత్మస్థైర్యంతో క్షేత్ర స్థాయిలో పని చేసి పార్టీ పునర్ వైభవానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని బంగారు తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం దోచుకుతింటున్నదని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని వరంగల్ నగరంలో మురికివాడలలో మూడు రోజులు పర్యటించి ఐదు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కెసిఆర్ తెడ్డు చూపారని దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని రైతులకు ప్రభుత్వం ఉందని నర్సిరెడ్డి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దొరల దొంగల ప్రభుత్వంగా ఉందని తెలంగాణ ఉద్యమ ద్రోహులను దరి చేర్చుకొని ఉద్యమకారులను మోసం చేశారని ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టడం ఖాయమని నర్సిరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులు ఇల్లందుల రమేష్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన సభ్యులు బండి పుల్లయ్య రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు గట్టు ప్రసాద్ బాబు అజ్మీరా రాజునాయక్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసచారి, పాలకుర్తి నియోకవర్గ సమన్వయ కర్త జాటోత్ ఇందిరా,మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ బాబా ఖాదర్ అలీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హన్మకొండ సాంబయ్య, కంప వినోద్ కుమార్,ఎండీ రహీం, శ్రీరాముల సురేష్ ముంజ వెంకట్రాజం గౌడ్, వడ్నాల నరేందర్, అర్శనపల్లి విద్యాసాగర్రావు, మార్గం సారంగం, మొక్కిరాల జనార్దన్ రావు, జీఎల్ శ్రీధర్, సి.యచ్.రఘుబాబు, చిల్వేరు రవీందర్, ఎలుగు వెంకటేశ్వర్లు, చొల్లేటి కృష్ణారెడ్డి, పోతరాజు అనిల్ కుమార్, భుాఖ్యా రాజేష్ నాయక్, కుసుమ శ్యాంసుందర్, గొల్లపల్లి ఈశ్వరాచారి,కాగితాల జయశంకర్, రామరమ, బర్ల యాకుాబ్, వల్లెపు శ్రీనివాస్, చిలువేరుమహేష్, రాపర్తి యాకయ్య, పిట్టల శ్రీనివాస్, వ్ళకోధర్ రెడ్డి,  లక్కం ప్రకాశ్, సౌరం సంపత్, నీలం పరుశరాములు, ఎలగందుల రవీందర్ గుప్తా, కటకం కుమారస్వామి వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గీత కార్మికుల వేషధారణ లో

Murali Krishna

21న కలెక్టరేట్ ఎదుట ఆందోళన

Bhavani

OTC New Penis Pills

Bhavani

Leave a Comment