27.7 C
Hyderabad
April 24, 2024 07: 32 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నా పై అసత్య ప్రచారాలా

33-Nara-Lokesh

మరో సారి సవాల్ విసురుతున్నా బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి నాకు సంబంధం ఉంది అని దొంగ చాటు ప్రచారం కాదు దమ్ముంటే నిరూపించండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ సవాల్ విసిరారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను హత్య చేసిన వైకాపా ప్రభుత్వం, సిఎం జగన్ చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్ర కి తెరలేపారని లోకేష్ అన్నారు. ఇంత కాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడింది. పోలీసులే అక్రమ ఇసుక రవాణా ని ప్రోత్సహిస్తున్నారు అని తలో మాటా చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు తన పై అసత్య ప్రచారాలకు తెర లేపారని లోకేష్ అన్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైకాపా నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడం తో మరో కొత్త నాటకం మొదలు పెట్టారని అన్నారు. 5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని వైకాపా ఇసుకాసురులు బలి తీసుకున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు తమ మొహాన ఉమ్ము వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసింది. గతంలోనే జగన్  నాపై అనేక ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. విశాఖ లో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ పై సిఐడి దాడులు, లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. నేను గతంలో అనేక సార్లు జగన్ కి నేరుగా సవాల్ చేసా. ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా జగన్ గారి చెత్త మీడియా కి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా, దొంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం కాదు దమ్ముంటే నా పై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి. బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా,సోషల్ మీడియా ఒక కుట్ర ప్రకారం నా పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం ,వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ అన్నారు.

Related posts

గద్వాల మార్కెట్ లో రికార్డు సృష్టిస్తున్న వేరుశనగ

Satyam NEWS

సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం

Satyam NEWS

ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలి: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment