30.2 C
Hyderabad
February 9, 2025 20: 48 PM
Slider ప్రత్యేకం

జోగితో రాసుకుంటే మీకు బూడిదే!

#naralokesh

జోగి రమేశ్… అంతెత్తున నోరేసుకుని పడిపోతుంటారు. అంతేనా వైసీపీ అధినేత జగన్ కు నమ్మినబంటుగా ఉన్న ఆయన గతంలో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకే దాడికి యత్నంచారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అందినకాడిని దోచుకుని కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక అధికారంలో ఉండగా… టీడీపీ శ్రేణులపై ఇస్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారు. లెక్కలేనన్ని కేసులు పెట్టంచారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

వైసీపీకి  రాజీనామా చేసిటీడీపీలోనో, జనసేనలోనో చేరేందుకు మార్గాంతరాలు వెతుకుతున్నారు. జోగి వ్యవహార సరళి తెలిసిన టీడీపీ శ్రేణులు… జోగిని పార్టీలో చేర్చుకుంటే సహంచేది లేదని తెగేసి చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు అత్యథిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ జోగి చేరికను అసలు పట్టంచుకోనే లేదు. అదే సమయంలో జనసేన కూడా జోగి చేరికకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి తరుణంలో పార్టీ శ్రేణులను ఆగ్రహానికి గురి చేసేలా మంత్రి కొలుసు పార్థసారధి, పార్టీ కీలక నేత, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు… జోగితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్థసారథితో పాటుగా శిరీష హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎవరు పిలిచారో గానీ…జోగి రమేశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ అసలు జోగికి ఆహ్వానం అందిందో, లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమానికి ఆ పార్టీ వైర వర్గాలకు ఎందుకు ఆహ్వానం అందుతుంది? నిజమే.. ఇప్పటికీ వైసీపీలోనే ఉన్న జోగికి ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానమేమీ అంది ఉండదు.

అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి… బీసీలంతా గౌరవంగా పూజించే గౌతు లచ్చన్న విగ్రహవిష్కరణకు ఓ బీసీ నేతగా హాజరై ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జోగి… ర్యాలీలో పార్థసారధి, శిరీషల పక్కనే ఓపెన్ టాప్ జీపులో నిలబడి నూజివీడు ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. ఈ ఫొటోలు, వీడియోలు చూసినంతనే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. టీడీపీ కార్యక్రమంలో వైసీపీకి చెందిన జోగిని ఎందుకు రానిచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లింది. అసలే వైసీపీ నేతలన్నా… జోగి లాంటి పెద్ద నోరున్న నేతలన్నా అల్లంత దూరం పాటించే లోకేశ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నియమావళిని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఆయన ఫైరయ్యారు. అసలు పార్టీ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కాకుండా ఇతరులు ముందు వరుసలో నిలుచున్న వైనం కూడా కనిపించలేదా?  టీడీపీ కార్యక్రమంలో వైసీపీ నేత కనిపించినా… కనిపించనట్లే నటించారా? అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అంతటితో ఆగని లోకేశ్… జోగి ర్యాలీలో పాలపంచుకున్న సందర్భంగా ఆయన పక్కన నిలుచున్న శిరీష, పార్థసారధిలకు ఫుల్లుగా క్లాస్ పీకినట్లుగా సమాచారం. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఇతర పార్టీ నేత మన కార్యక్రమాలకు వస్తే… వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ సాగుతారా? అనిలోకేశ్ వాారిని నిలదీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగి హాజరీపై మంత్రిగా ఉన్న పార్థసారథి గానీ, ఎమ్మెల్యేగా ఉన్న శిరీష గానీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ లోకేశ్ మండిపడినట్లు సమాచారం. లోకేశ్ ఆగ్రహంతో జరిగిన పొరపాటును గ్రహించిన శిరీష… ఘటనపై చింతిస్తున్నట్లుగా వీడియో విడుదల చేశారు.ఇక పార్థసారధి నుంచి ఈ తరహా దిద్దుబాటు కూడా కనిపించలేదు.

Related posts

జనతా గ్యారేజ్: ట్రంప్ విధ్వంసానికి రిపేర్లు మొదలు

Satyam NEWS

శుభ్రమైన నీటికోసం ఏపిలో వాటర్ గ్రిడ్

Satyam NEWS

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్?

Satyam NEWS

Leave a Comment