విలక్షణమైన పాత్రలతో తనకంటూ గుర్తింపు పొందిన టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినా, రోహిత్ నటన మీద ఉన్న ఆసక్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి చిత్రం “బాణం” ద్వారా టాలీవుడ్‌లో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు రోహిత్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. తర్వాత పలు విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ స్థిరమైన గుర్తింపును సాధించిన రోహిత్, కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన అభిమానులకు ఒక శుభవార్త కబురు వచ్చింది. రోహిత్ త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెప్పబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెలలోనే ఓ నటితో నిశ్చితార్థం జరగబోతుందని సమాచారం. రోహిత్ తాజాగా నటించిన “ప్రతినిధి-2” సినిమాలో ఆయన సరసన నటించిన సిరి లేళ్లనే ఆయన వివాహం చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వేడుక హైదరాబాద్‌లో జరగనుండగా, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వంటి ప్రముఖ కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
previous post
next post