పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా కోటప్పకొండ ఘాట్ రోడ్డు, కోటప్పకొండ చుట్టు రోడ్లు అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.30 కోట్లు పైగా అవసరమవుతుందని వివరించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల గురించి వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, సాగునీటి కాలవల్లో పూడిక తొలగింపు లాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ కోరారు. గ్రామీణ ప్రాంతాలంటే రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమని,అటువంటి ప్రాంతాల అభివృద్ధికి ఎప్పుడూ అండగా నిలిచే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అదే సమయంలో కోటప్పకొండ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వెంట టీడీపీ నాయకులు శాఖమురి రామూర్తి ఉన్నారు.