32.7 C
Hyderabad
March 29, 2024 10: 23 AM
Slider గుంటూరు

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

#gopireddysrinivasareddy

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆరో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు అమ్మఒడి, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందాయా లేదా అని ఆరా తీశారు. పలు సబ్జెట్ల గురించి విద్యార్థులకు ప్రశ్నలు సంధించారు. విద్యార్ధులు ఆంగ్లంలో సమాధానం చెప్పటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని, కాబట్టి విద్యార్థులంతా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించి.. పాఠశాలకు, తల్లిదండ్రులను మంచి పేరు తీసుకురావాలని కోరారు.

మధ్యాహ్నం భోజనం పథకం పరిశీలన..

ప్రభుత్వం అందిస్తోన్న మధ్యాహ్న భోజనం పథకం గురించి జరుగుతున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టేందుకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. లింగంగుంట్ల జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తూన్న మధ్యాహ్న భోజనాన్ని నేరుగా పరిశీలించారు. వంట పదార్థాలు, భోజన నాణ్యతను పరిశీలించారు. భోజనం, కోడిగుడ్లు, చిక్కిలను రుచి చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనంపై రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. తిలక్ స్కూల్ లో పురుగులు పట్టిన గుడ్లు పంపిణి చేశారనే విషయం ఆ వాస్తవమని తేల్చిచెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్ధులకు అందించే భోజనం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి దురాచారాలను సహించేది లేదన్నారు. ఇప్పటికే ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు.

నూతన విద్యా విధానంపై ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి హాజరు..

లింగంగుంట్ల పాఠశాలలో నిర్వహించిన నరసరావుపేట డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.

జాతీయ నూతన విద్యావిధానం అమలుచేయాలనే ఆదేశాల నేపథ్యంలో పాఠశాల విద్యలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కొత్త విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తాయని, వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించి సత్ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విద్యార్థులకు జాపక శక్తితో పాటు, కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారని.. ఇలాంటి సమయంలో వారు ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలకు రావడం ద్వారా అనుభవులైన ఉపాధ్యాయుల ద్వారా బోధన జరపడం ద్వారా పై తరగతులకు వెళ్లే సమయానికి చురుకుగా ఉంటారని అన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో అమలువుతోన్న విధానం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, మిడ్ డే మీల్సా లాంటి పధకాలు అమలు చేస్తుందని, వాటి ద్వారానే ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలలకు అధనపు తరగతుల కేటాయింపు కూడా జరగుతుందన్నారు. పమిడి మర్రు పాఠశాలను పూర్తి గా పునర్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని డీఈవో ని కోరారు.

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సమస్యలు వస్తే ఎంఈవో కి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేసే పనులను సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులకు నాడు నేడు పనులు అప్పగించడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయంపై వివరణ ఇచ్చారు. కాంట్రాక్టర్లు వారి లాభాలు చూసుకుంటారని, ఉపాధ్యాయులై తే పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే పనులు అప్పగించడం జరిగిందన్నారు. సమస్యలన్నీ అధిగమించుకుని అందరం ముందుకు సాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట జడ్పీటీసీ చిట్టిబాబు, మూరబోయిన శ్రీను, రొంపిచర్ల జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, ఆర్జేడీ సుబ్బారావు,  విద్యా కమిటి చైర్మన్ కాశిరెడ్డి, పోన్నాపాటి విజయ్, డీఈవో గంగాభావానీ, డి. డీఈవో సుధాకర్ రెడ్డి, ఎమ్ఈవో జ్యోతికిరణ్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనా సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం…..

Satyam NEWS

రెండు నెలలకు రూ.6 లక్షల విద్యుత్ బిల్లు

Satyam NEWS

కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి

Bhavani

Leave a Comment