27.7 C
Hyderabad
April 25, 2024 09: 22 AM
Slider గుంటూరు

నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలి

#narasaraopet

పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేసే వరకు నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు జరగవని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఈరోజు స్థానిక స్థానిక నరసరావుపేట లోని పల్నాడురోడ్ లో గల  డీబీహెచ్ పీయస్ రాష్ట్రకార్యాలయంలో జరిగిన  సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసరావుపేట మున్సిపాలిటీగా ఏర్పడి 105సంవత్సరములు అయినప్పటికీ ఇంతవరకు నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేయలేదని ఆంధ్రప్రదేశ్ ఎస్సీకమీషన్ కు గతంలో ఈవిషయంపై  ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీకమీషన్ నరసరావుపేట మున్సిపల్ ఎన్నిక రిజర్వేషన్ పై విచారణ చేపట్టాలని   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరగా విషయంపై విచారణ చేపట్టిన  ఎన్నికల అధికారులకు నరసరావుపేట మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగిన మున్సిపల్ ఛైర్మన్ల పేర్లు,వారి కులం,పదవీకాలం తదితర వివరాలను  అందజేశామని తెలిపారు.

నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేయడం ఖాయమని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీబీహెచ్ పీయస్ నాయకులు గోదా వెంకట రమణ,సతీష్,మరియదాసు,శ్రీనివాసరావు,మహేష్,సురేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు

Related posts

మమతా బెనర్జీకి ప్రధాని సమక్షంలోనే ఘోర అవమానం

Satyam NEWS

లద్దాక్ ప్రాంతంలో అరుదైన రికార్డు సాధించిన బిఆర్ఓ

Satyam NEWS

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

Bhavani

Leave a Comment