36.2 C
Hyderabad
April 25, 2024 21: 11 PM
Slider ప్రకాశం

మత్తు మందుల తయారీకి అడ్డాగా మారిన ప్రకాశం జిల్లా

#prakasham dist

ప్రకాశం జిల్లాలో మత్తుమందుల కలకలం రేగింది. జిల్లాలోని త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రంలో మత్తుమందుల తయారీ వెలుగులోకి వచ్చింది.

శ్రీగంధం తోటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్‌ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి రూ.67 లక్షలు విలువైన 20 కిలోల డైజోఫాం, అల్ఫాజోలం మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.

ఇక్కడ తయారు చేస్తున్న మత్తుమందులను ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాలపై ఎస్‌ఈబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఎక్కువగా తెలంగాణలోని వివిధ కళాశాలల విద్యార్థులు, కల్లు తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

Related posts

కృష్ణానదిలో కార్తీక మాసం సందర్భంగా పవిత్ర హారతి

Satyam NEWS

ట్రెడిషన్: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి

Satyam NEWS

హైదరాబాద్లో రెండు భారీ భవనాల కూల్చివేత

Bhavani

Leave a Comment