40.2 C
Hyderabad
April 19, 2024 16: 41 PM
Slider తెలంగాణ

తెలంగాణలో త్వరలో నార్కోటిక్స్ స్పెషల్ వింగ్

#KCR

రాష్ట్రంలో డ్రగ్ ట్రాఫికింగు, డ్రగ్ పెడ్లింగులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం పోలీసుశాఖలో త్వరలో నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేయబోతున్నదారు. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ విభాగం కోసం భారీగా ప్రత్యేక సిబ్బంది నియామకం జరుగుతుంది. మత్తుపదార్థాల రవాణా సమాచార సేకరణ కోసం ప్రత్యేక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంటుంది. దీనికోసం పాత జిల్లా కేంద్రాల్లో 10 ప్రత్యేక నార్కోటిక్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు అన్నిస్థాయిల్లో పోస్టుల స్థాయి ఉంటుంది.

రాష్ట్ర హోంశాఖ నుంచి ఈ మేరకు ముఖ్యమంత్రికి ఫైల్ చేరింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించనుంది. సీఎం కేసీఆర్ ఆమోదంతో మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు వస్తాయి. కేంద్రం సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో నార్కోటిక్స్ ప్రత్యేక వెంగులు ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. నార్కోటిక్స్ ప్రత్యేక వింగు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ 2022 నవంబర్ లో కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ అందింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నార్కోటిక్ వింగుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్రం సేకరిస్తోన్నది. నార్కోటిక్ వింగ్ తో పాటు సైబర్ క్రైం, కమాండ్ కంట్రోల్ రూం, ఇతర విభాగాలకు కలిపి పోలీసుశాఖలో త్వరలో మరో 4 వేల పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉంది.

Related posts

ప్రజల భద్రత కోసమే పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS

Leave a Comment