39.2 C
Hyderabad
April 18, 2024 17: 20 PM
Slider సంపాదకీయం

థాంక్స్: విశాఖ ప్రజలకు మోడీ చేసిన పెద్ద సాయం ఇది

#Narendra Modi 13

ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేసి ఉండకపోతే విశాఖలో విషవాయువు లీక్ సంఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి దోషిగా నిలబడి ఉండేది. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటిన పిటిబిసి తరలించే ఏర్పాట్లు చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ విధంగా చేయకపోతే విశాఖ పట్నం ప్రజలకు మరింత అన్యాయం జరిగి ఉండేది. స్టైరీన్ వాయువు ప్రమాదవశాత్తూ గాలిలోకి విడుదల అయినప్పుడు తీవ్రమైన పరిణామాలు రేకెత్తుతాయి. అందువల్ల ఆ వాయువు వాడే ఫ్యాక్టరీలో పిటిబిసి పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకోవాలి.

పిటిబిసి అంటే పారా టెరిటరీ బుటైల్ కాతెకోల్. ఇది స్టైరీన్ లాంటి విషవాయువులను న్యూట్రలైజ్ చేస్తుంది. స్టైరీన్ లాంటి విషవాయువు వాడే ఫ్యాక్టరీలలో పిటిబిసి పెద్ద ఎత్తున నిల్వ ఉండాలి. అయితే ఎల్ జి పాలిమర్స్ వద్ద పిటిబిసి నిల్వలు అవసరమైనన్ని లేవు.

అవసరమైనంత పిటిబిసి లేని విషయం విషవాయువు పెద్ద ఎత్తున విడుదల అయి 6 గురు చనిపోయే వరకూ కూడా బయటకు రాలేదు. ఈ లోపు విషవాయువు విస్తరించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పసిగట్టింది.

ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ప్రధాని ఫోన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిబిసి అవసరాన్ని చెప్పి దాన్ని గుజరాత్ నుంచి పంపించాల్సిందిగా కోరారు. పిటిబిసి దక్షిణ గుజరాత్ లోని వల్సాద్ జిల్లా వాపిలోని ఒక కర్మాగారం తయారు చేస్తుంది.

అప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులు సమాచారం అందించినందున తక్షణమే ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానితో మాట్లాడారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక కార్గో విమానాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని ఆదేశాలు ఇచ్చారు. దాంతో చకచకా పనులు జరిగాయి.

ఎయిర్ ఇండియా కార్గో విమానం విశాఖ పట్నం చేరింది. పిటిబిసిని చల్లడం ద్వారా విషవాయువు ప్రభావాన్ని అరికట్టేందుకు వీలుకలిగింది.

Related posts

కలెక్ట‌ర్కు మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు

Sub Editor

కెసిఆర్ సారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

Satyam NEWS

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

Leave a Comment