33.2 C
Hyderabad
April 26, 2024 01: 44 AM
Slider ఖమ్మం

జాతిని మోసం చేస్తున్న నరేంద్ర మోడీ

#cpmcpi

విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయడంతోపాటు కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని, తక్షణమే తన పర్యటనను రద్దుచేసుకొని వెనక్కి వెళ్ళాలని సిపిఎం, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌లు డిమాండ్‌ చేశారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండు సెంటర్‌ వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్దం, ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్ లు  మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం కాకుండా అదానీ, అంబానీ లాంటి కుబేరుల కోసం పని చేస్తున్నారని వారు విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.

ఓవైపు ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తూ మరో పక్క రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పటం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ యిచ్చి లక్షలాది మంది ఉద్యోగులను, కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని, కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధాని అయిన మోడీ ఆ రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ ప్రభుత్వాన్ని కార్పొరేట్స్‌ చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. 2021 సం.లో పున: ప్రారంభమై లాభాల్లో నడుస్తున్న రామగుండం ఫెర్టిలైజర్స్‌ ఎరువుల కంపెనీని యిప్పుడు జాతికి అంకితం యివ్వడం ఏమిటి అని అన్నారు. దీన్ని కూడా తన యిద్దరు గుజరాత్‌ మిత్రులకు అప్పజెప్పటం కోసమే అని విమర్శించారు.

8 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదని, వివక్షతతో రాష్ట్రాన్ని దివాళా తీయించే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజల కార్మిక, కర్షకుల నినాదమే మోడీ గోబ్యాక్‌ అని వారు అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులతో పాటు జిల్లా ప్రజా సంఘాల నాయకులను కూడా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సి‌పి‌ఐ  నాయకులు పాల్గొన్నారు. 

Related posts

నిర్లక్ష్యం వద్దు

Sub Editor 2

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసా?

Satyam NEWS

కరోనాపై పోరాటానికి బూచేపల్లి విరాళం రూ.25 లక్షలు

Satyam NEWS

Leave a Comment