28.7 C
Hyderabad
April 20, 2024 04: 28 AM
Slider ప్రత్యేకం

త్వరలో ముక్కుద్వారా కరోనా వ్యాక్సిన్: ప్రధాని వెల్లడి

pm-modi-10

కరోనా కొత్త వేరియంట్లపై యుద్ధం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నదని ఆయన తెలిపారు. శనివారం రాత్రి అకస్మాత్తుగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. దేశంలో 61 శాతం మందికి ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందచేసినట్లు ఆయన తెలిపారు. గోవా, ఉత్తరాఖండ్ లాంటి పర్యాటక ప్రాధాన్యత రాష్ట్రాలలో కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అందరూ ఒమైక్రాన్ వేరియట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కరోనా దేశం నుంచి పూర్తిగా పోలేదని అందువల్ల అందరూ జాగరూకులై ఉండాలని ఆయన తెలిపారు.  

Related posts

వల్కనో ఎఫెక్ట్ : ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బ్లాస్ట్ లావా తో ఇబ్బంది

Satyam NEWS

రియలైజేషన్: గెలుపు ఓటములు సహజం

Satyam NEWS

యస్సి, యస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment