దుర్గ పూజ చేస్తున్న తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ముస్లిం మత పెద్దకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపి నస్రత్ జహాన్ తగిన సమాధానం ఇచ్చారు. ముస్లిం అయి ఉండి హిందువులు ధరించే మంగళ సూత్రం, నుదుట కుంకుమ ధరిస్తున్న నస్రత్ జహాన్ పేరు మార్చుకుని మతం మారితే బాగుంటుందని ఒక ముస్లిం మత పెద్ద అన్నారు. దానికి తీవ్రంగా స్పందించిన నస్రత్ జహాన్ తనకు పేరు పెట్టిన వారు కాకుండా వేరే ఎవరికి తన పేరును మార్చుకొమ్మని చెప్పే అర్హత లేదని అన్నారు. ఈ సమయంలో మతం తదితర విషయాలు పట్టించుకోవద్దని దసరా ఉత్సవాలలో పాల్గొని సంతోషంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ముస్లింగా పుట్టిన నస్రత్ జహాన్ ఏడాది కిందట బిజినెస్ మెన్ అయిన నిఖిల్ జైన్ అనే హిందువు ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె మంగళ సూత్రం ధరిస్తూ నుదుటన కుంకుమ పెట్టుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లోని బషీరత్ నియోజకవర్గం నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. దుర్గా పూజలో ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఆమె దుర్గపూజలో పాల్గొని చేస్తున్న దాండియా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద ఒకరు ఆమె వేషధారణపై వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. దీనికి ఆమె ఈ విధమైన సమాధానం ఇచ్చి దీన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని కోరారు.
previous post
next post