34.2 C
Hyderabad
May 16, 2024 16: 10 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ మెట్రో రైల్ పుస్తకానికి జాతీయ అవార్డు

#metroril

హైదరాబాద్ మెట్రో రైల్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం రూపొందించిన “హైదరాబాద్ మెట్రో రైల్ – ఎ పిక్టోరియల్ ఓవర్ వ్యూ” పుస్తకం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ పుస్తకంలో దాదాపు 2000 ఛాయాచిత్రాలు ఉపయోగించారు.

ఆదివారం (డిసెంబర్ 25) నాడు భోపాల్‌లో జరిగిన పిఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్య మంత్రి కైలాష్ విశ్వాస్ సారంగ్ ఈ అవార్డును సిపిఆర్‌ఓ మల్లాది కృష్ణానంద్‌కు అందజేశారు. “ఒక చిత్రం వెయ్యి పదాలు మాట్లాడుతుంది” అనే వాక్యం నిజమైన స్ఫూర్తితో, ఈ 800 పేజీల కాఫీ టేబుల్ పుస్తకం రూపొందించారు.

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహించిన ఈవెంట్‌లు మొత్తం ఈ పుస్తకంలో కవర్ చేశారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్ మరియు స్టేషన్ల చురుకైన నిర్మాణ దశలో ఎదుర్కొన్న వివిధ అడ్డంకులను, వాటితో బాటు పూర్తి అయిన తర్వాత మనోహరమైన ఛాయాచిత్రాలతో ఈ పుస్తకం రూపొందించారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ గురించి వివరంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ పుస్తకం పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. జాతీయ అవార్డు అందుకున్న కృష్ణంద్‌ను హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు.

Related posts

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

Satyam NEWS

హంపీ సుందరి

Satyam NEWS

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment