30.7 C
Hyderabad
April 19, 2024 07: 34 AM
Slider నల్గొండ

రైతు,కార్మిక చట్టాల సవరణ నిలిపి వేసే దాకా ఉద్యమం ఆగదు

#Hujurnagar Bundh

భారతదేశంలో గడిన నాలుగు నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పూర్తిస్థాయిలో బందు కార్యక్రమం జరిగింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన బందు కార్యక్రమం అనంతరం జరిగిన రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను,కార్మిక చట్టాల సవరణను నిలిపి వేసే దాకా ఉద్యమాలు ఆగవని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం,సిపిఐఎంఎల్, తెలుగుదేశం పార్టీలు హుజూర్ నగర్ పట్టణంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ర్యాలీ నిర్వహిస్తూ విద్యా,వ్యాపార, వర్తక,వాణిజ్య అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించి తమ నిరసనను కేంద్రప్రభుత్వానికి తెలియజేశారు.

MD అజీజ్ పాషా మాట్లాడుతూ మోడీ అదానీ అంబానీలకు తాకట్టు పెట్టేందుకే కార్పోరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రైతులకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని, నిత్యావసర సరుకులు,డిజిల్,పెట్రోల్  ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారని కేంద్ర  ప్రభుత్వ వైఖరిని అన్ని అఖిలపక్ష పార్టీలు ఎండగట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని,నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా,పట్టణ నాయకులు,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకులు సాముల శివారెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు, బాచిమంచి గిరిబాబు,కస్తాల శ్రవణ్ కుమార్,జక్కుల మల్లయ్య,ముల్కలపల్లి రామ్ గోపి,దొంతగాని జగన్, బెల్లంకొండ గురవయ్య, పాశం రామరాజు, మేళ్లచెరువు ముక్కంటి, సలిగంటి జానయ్య,తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Related posts

వకీల్ సాబ్ మెట్రోలో వచ్చేశాడు

Satyam NEWS

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆదెర్ల

Satyam NEWS

ఘనంగా తెలంగాణా స్పీకర్ పోచారం జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment