28.2 C
Hyderabad
April 20, 2024 13: 57 PM
Slider నల్గొండ

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు

#NationalBundh

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా నిర్వహించారు. ఐ ఎన్ టి యు సి, ఏ ఐ టి యు సి,సి ఐ టి యు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కోదాడ, మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి పలువురు నాయకులు ప్రసంగించారు.

ఐఎన్టీయూసి నాయకుడు కొనతం చిన్న వెంకటరెడ్డి, ఏ ఐ టి యూసి నాయకుడు ధూళిపాల ధనంజయ నాయుడు, సి ఐ టి యు నాయకుడు రవి నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటులో అమలు చేసిన 3 రైతాంగ వ్యతిరేక బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి 4 code లను అమలు చేయాలని నిర్ణయించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా వారిని ఇబ్బంది పెట్టడం తగదని, కార్మికుల హక్కులను కాలరాసి వారి హక్కులను హరింపచేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, దేశ వ్యాపితంగా ఉన్న రైతులు వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క తాటి పై వచ్చి దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది  ఒకేసారి సమ్మె చేయడం స్వతంత్ర భారతంలో ఇదే ప్రప్రథమం అని అన్నారు.

లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఎల్ఐసి, ఆల్విన్ తో పాటు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీన్ని యావత్ దేశం వ్యతిరేకిస్తోందని  అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొదమ గుండ్ల నరేష్, సిపిఐ మండల కార్యదర్శి మండల కార్యదర్శి రావుల సత్యం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బచ్చల కూరి ప్రకాష్, నాగయ్య

సిపిఎం నాయకులు చట్టు శ్రీనివాస్,మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, రామకృష్ణారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఊర వెంకన్న, ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ కొమర్రాజు వెంకట్, పాండు నాయక్, కోదాటి సైదులు, నీలా రామ్మూర్తి, ఎడ్ల సైదులు, మచ్చ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 380 మందికి అవార్డులు

Satyam NEWS

కుంగిపోతున్న ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు

Satyam NEWS

కొల్లాపూర్ లో మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment