36.2 C
Hyderabad
April 24, 2024 19: 27 PM
Slider నల్గొండ

26న జాతీయ కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె

#CITUC Hujurnagar

ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తు పలు దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠాలు ప్రజల  తిరుగుబాటుతో కదిలేలా చేశారని, అలాంటి పరిస్థితే భారతదేశంలోని కార్మిక చట్టాల సవరణ, రైతుల నడ్డివిరిచే విధానాలు వల్ల బిజెపి ప్రభుత్వ ప్రధాని మోడీకి అలాంటి స్థితే కలుగుతుందని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ  దగ్గర హమాలి కార్మికుల సమావేశంలో నవంబర్ 26న జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మెకు హమాలీ కార్మికులందరూ  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, గోడ పోస్టర్ ని విడుదల చేసిన అనంతరం  రోషపతి మాట్లాడుతూ రైతులని, కార్మికులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు చరిత్రలో హీనులుగా ప్రపంచ పటంలో నిలిచారని అన్నారు.

సి ఐ టి యు స్వర్ణోత్సవాల ముగింపు సందర్భంగా ఆల్ ఇండియా ఆన్లైన్ బహిరంగ సభ విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా నాయకులు  యలక సోమయ్య గౌడ్, యం. శ్రీను, సైదులు, దేశ బోయిన వెంకన్న, శీలం వెంకన్న, ఇంటి రామన్న,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రణాళికలతోనే స్వచ్ఛ హరిత పురపాలికల అభివృద్ధి సాధ్యం

Satyam NEWS

స్వాగతిద్దామ్

Satyam NEWS

లోకేషా ఎంత పని చేశావు లోకేషా…..?

Satyam NEWS

Leave a Comment