24.7 C
Hyderabad
March 29, 2024 07: 25 AM
Slider నల్గొండ

ప్రభుత్వ రంగ సంస్థలను,ప్రజలను రక్షించుకుందాం

#cituc

సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిద్దామని,ఈ నెల 28,29వ, తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కార్మికలు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్(తపాలా కార్యాలయం) బిఎస్ఎన్ఎల్ కార్యాలయం,వివిధ బ్యాంకు కార్యాలయాల్లో దేశ సార్వత్రిక సమ్మె నోటీసు ఇచ్చిన కరపత్రాలు పంచారు.అనంతరం రోషపతి మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని,అదే స్థానంలో పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలని, తపాలా శాఖ ప్రైవేటీకరణలో భాగంగా తీసుకు వచ్చిన ఫ్రాంచైజ్ అవుట్ లెట్ వెంటనే నిలుపుదల చేయాలని,కరోనా  తో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇవ్వాలని, బిఎస్ఎన్ఎల్ లో 4జి కొనుగోలు ప్రైవేటీకరణకి బిఎస్ఎన్ఎల్ మధ్య వివక్షత వద్దని,ఉద్యోగులకు మూడో వేతన సవరణ అమలు చేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను మరల పనిలోకి తీసుకోవాలని,వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని,బ్యాంకులో భద్రపరచుకున్న ప్రజల ఆస్తిని కాపాడాలని,క్లస్టర్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యల్క సోమయ్య గౌడ్, తపాలా శాఖ ఉద్యోగ సంఘం నాయకులు గోపి నాయక్,సైదయ్య, కల్పనా,కుమారి,ఆనందరావు,మేరిగ సురేష్,బిఎస్ఎన్ఎల్ తెలంగాణ ఉద్యోగ యూనియన్ నాయకులు పరిపూర్ణ చారి,అక్బర్,ధనరాజు,నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బ్యూటిఫికేషన్: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం

Satyam NEWS

ఘనంగా మాలమహానాడు వ్యవస్థాపకుడు పివి రావు వర్ధంతి

Satyam NEWS

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్

Satyam NEWS

Leave a Comment