24.7 C
Hyderabad
March 29, 2024 05: 33 AM
Slider శ్రీకాకుళం

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్ధులు పూలమాలతో నివాళి అర్పించారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించు కోవడం జరిగిందని, అందుకే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం గా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరి చే రాజ్యాంగ పీఠికను చదివించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, సంపతి రావు రమణమ్మ, నక్కిన స్వప్న, పంచి రెడ్డి మోహన రావు, నారాయణశెట్టి హరికృష్ణ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ సేవలు ప్రారంభం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ నిరుపేదల అభ్యున్నతి కృషి చేస్తోంది : రేవంత్ రెడ్డి

Satyam NEWS

రేపటి నుంచి గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment