27.7 C
Hyderabad
April 26, 2024 03: 31 AM
Slider మెదక్

సిద్దిపేట మీదుగా జాతీయ రహదారి: గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

#Harishrao

రాష్ట్రంలో రెండు జాతీయ రహదారులను జాతీయ రహదారిగా  కేంద్రం గుర్తింపు తెలిపింది. అందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా సిద్దిపేట నుండి వరంగల్  అనుసంధానం చేసే  మెదక్‌ నుంచి రామాయంపేట, సిద్దిపేట, హుస్నాబాద్‌ మీదుగా ఎల్కతుర్తి జంక్షన్‌  వరకు 133 కిలోమీటర్ల పొడవుతో జాతీయ రహదారిని కేంద్రం ఆమోదించింది. ఈ జాతీయ రహదారితో వరంగల్‌ నుంచి మెదక్‌ వెళ్లే వాహనాలకు సులభతర రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. జాతీయ రహదారులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళతాయి. కానీ, సిద్దిపేట, కరీంనగర్, హుస్నాబాద్ ప్రాంతాలకు ఇప్పటి వరకు జాతీయ రహదారి సౌకర్యం లేదు.

ఇప్పుడు కొత్తగా గుర్తింప బడిన “మెదక్ నుండి వరంగల్ “ వెళ్లే జాతీయ రహదారి ఏర్పాటు కావడం వలన ట్రాఫిక్ ఇబ్బంది కూడుకున్న  హైదరాబాద్ ప్రవేశం లేకుండా ఢిల్లీ , నాగ్ పూర్ నుండి వచ్చే వాహనాలకు, వరంగల్ ప్రయాణం సులభతరం అవుతుంది.

ఎన్నో ఏళ్ల కల..

సిద్దిపేట ప్రాంతానికి జాతీయ రహదారి రావాలని ఎన్నో ఏళ్ల కల ..ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి.

సమైక్యాంధ్ర లో కూడా ఎన్నో మార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన జాతీయ రహదారికి మోక్షం కాలే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రికి నేరుగా కలిసి , కేంద్ర మంత్రులకు ఎన్నో లేఖలు వ్రాయడం తో ఇది సాధ్యం అయింది.. సిద్దిపేట ప్రాంతానికి జాతీయ రహదారి ఏర్పాటు తో ఎన్నో పరిశ్రమలు , రవాణా రాకపోకలు , వాణిజ్య  వ్యాపార రంగాల కేంద్రంగా మారుతుంది.. సిద్దిపేట ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న పరిశ్రమల సముదాయ కేంద్రం  ముందు నుండే ఈ జాతీయ రహదారి వెళుతున్న నేపథ్యంలో, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు, సరకుల రవాణాకు, ఉత్పత్తి అయిన సామగ్రి తరలింపుకు అనువుగా వుండి, ఇంకా ఈ ప్రాంతం వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది..

ఫలించిన మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి..

సిద్దిపేట కు జాతీయ రహదారి ఏర్పాటు కు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ తో మంత్రి హరీష్ రావు గారు , ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో ,అధికారులతో కలవడం ,  సమీక్షలు నిర్వహించారు.. మంత్రి హరీష్ రావు గారు జాతీయ రహదారుల ఇంజనీర్ల తో పలు మార్లు సమీక్షలు జరిపి,  సులభతర రవాణా, ప్రాంత అభివృద్ది, ప్రజలకు జరిగే లాభాలు, వాణిజ్య పరంగా వృద్ది లాంటి పలు అంశాల మీద పలు విడతలుగా చర్చలు జరిపి జాతీయ రహదారి ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, ప్రతిపాదనలలో కీలకాంశాలను చేర్చే విదంగా చూసారు

సంతోషంగా ఉంది.. మంత్రి హరీష్ రావు

” సిద్దిపేట మీదుగా జాతీయ రహదారి ” ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎన్నో ఏళ్ల కల ఇప్పుడు సిద్దిపేట జాతీయ రహదారిలతో రవాణా రాకపోకల సౌకర్యం వల్ల సిద్దిపేట ప్రాంత వాణిజ్య  వ్యాపార రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడనుంది సిద్దిపేట పట్టణాన్ని అనుకోని ఈ రహదారి వెళ్లడం ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Related posts

వైసీపీ హయాంలో మైనారిటీలకు వంచన…

Bhavani

ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీల్లో మగ్గిపోతున్న కరోనా శవాలు

Satyam NEWS

ఎస్ఐగా ఎంపికైన కానిస్టేబుల్ అజయ్ ను అభినందించిన జిల్లా ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment