39.2 C
Hyderabad
April 23, 2024 15: 14 PM
Slider ఆదిలాబాద్

జాతీయ రహదారి ఆధునీకరణకు రూ.44 కోట్లు

#MPSoyamBapurao

అదిలాబాద్ పెన్ గంగ నుండి సోన్ వరకు జాతీయ రహదారి ఆధునీకరణలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ. 44 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు.

అదిలాబాద్ సమీపంలోని పోచెర రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద సర్వీస్ రోడ్డు పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదార్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సొమ్ము కేంద్రందీ..సోకు రాష్ట్రానిది…. అన్న తీరుగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని ఎంపి విమర్శించారు.

రైతు వేదిక నిర్మాణం లో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు వేదికల్లో రాజకీయాలు తగవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టుకొని ఆర్భాటం చేస్తున్నారని వీటిలో సగం వరకు డబ్బులు కేంద్రానిదేనని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోటో తప్పనిసరిగా పెట్టాలని డిమాండ్ చేశారు.

గుండె త్వరగా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తామని వ్యవసాయ బిల్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ ఎంపీ సోయం బాబూరావు చొరవతో జాతీయ రహదారి విస్తరణ ఆధునీకరణ పనులు జరగడం శుభసూచక మన్నారు.

నాణ్యతతో పనులు చేపట్టి ప్రజలకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్ జిల్లా నాయకులు ఆదినాథ్, నాంపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూడోసారి కరోనా వేక్సిన్ ను వేయించుకున్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

తెలంగాణ ఆడబిడ్డ లు బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకోవాలి

Satyam NEWS

టీటీడీ బోర్డులో నేరచరితుల నియామక పిటీషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

Satyam NEWS

Leave a Comment