37.2 C
Hyderabad
March 28, 2024 17: 16 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ గ్రంథాలయ విభాగం వారు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.యం.సుందరవల్లి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ విద్యార్థులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొని జ్ఞాన సముపార్జనను పెంపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా గ్రంథాలయ ఇంచార్జ్ డాక్టర్. వై.సుధారాణి వ్యవహరించారు. వివిధ ప్రాంతాల ప్రముఖ పుస్తక ప్రచురణ మరియు విక్రయ సంస్థల యొక్క పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచబడ్డాయి. వివిధ శాస్త్ర విభాగాలకు, పోటీ పరీక్షలకు,

వ్యక్తిత్వ వికాసానికి, సాహిత్యానికి, పురాణాలకు మరియు ఇతిహాసాలకు సంబంధించిన సుమారు 5వేలకు పైగా పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్. పి.రామచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. జి.విజయానంద కుమార్ బాబు, ఆచార్య అందే ప్రసాద్, అధ్యాపక, అధ్యాపకేతర, గ్రంథాలయ సిబ్బంది, పరిశోధక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

6 వేల కోట్లకు 1500 కోట్లే బడ్జెట్లో పెడతారా..?

Bhavani

ప్రపంచం గర్వించదగిన మహనీయుడు అంబేద్కర్

Satyam NEWS

కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment