ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చే కథనాలు ప్రచురించిన ప్రింట్ మీడియా, ప్రసారం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా లేదా డిజిటల్ మీడియాకు జాతీయ మీడియా అవార్డులను ప్రదానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవలి కాలంలో అలాంటి కథనాలు ప్రచురించిన ప్రింట్ మీడియా ప్రసారం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంట్రీలను కోరుతున్నది. ఎంపిక అయిన కథనాలకు జనవరి 25న జరిగే జాతీయ ఓటరు దినోత్సవం నాడు అవార్డులను ప్రదానం చేస్తారు. ఎన్నికల విధానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు నిర్దేశించిన కథనాలు, ఓటర్లను ఉత్సాహపరిచే కథనాలను ఈ అవార్డుల కోసం పంపాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ హిందీ కాకుండా ఇతర భాషలలో వెలువడిన కథనాలను ఇంగ్లీష్ లో తర్జుమా చేసి పంపాల్సి ఉంటుంది. నిర్వహించిన ఓటరు అవగాహనా కార్యక్రమాలు, ఓటరుపై అవి చూపిన ప్రభావం ఆధారంగా ఉత్తమ కథనాలు ఎంపిక చేస్తారు. ప్రింట్ మీడియా అయితే ఎన్ని ఆర్టికల్స్ ప్రచురితం అయ్యాయి, స్క్వేర్ సెంటీమీటర్లలో ప్రింట్ ఏరియా వివరాలు ఇవ్వాలి. సంబంధిత ఆర్టికల్స్ పిడిఎఫ్ సాఫ్ట్ కాపీ లేదా వెబ్ అడ్రస్ లింక్ ఫొటో కాపీ జత చేయాల్సి ఉంటంది. ఎలక్ట్రానిక్ మీడియా అయితే ప్రసారం చేసిన విషయాన్ని సిడి లేదా డివిడి లేదా పెన్ డ్రైవ్ లో ఉవ్వాల్సి ఉంటుంది. ఆన్ లైన్, సోషల్ మీడియా అయితే పోస్టు వివరాలు అందచేయాల్సి ఉంటుంది. ఎంట్రీలను ఈ నెల 31లోపు పవన్ దివాన్, అండర్ సెక్రటరీ (కమ్యూనికేషన్) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్ న్యూఢిల్లీ 110011 కు పంపాలి.
previous post