36.2 C
Hyderabad
April 25, 2024 19: 17 PM
Slider నల్గొండ

దేశ సంపదను పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పచెప్పటం న్యాయమా?

#roshapathi

ప్రజలను విస్మరించిన ఏ పార్టీ మనుగడ సాధించలేదని,కేంద్రంలోని బిజెపి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి పెట్టుబడిదారుల బాగు కోసం పనిచేస్తున్నాయని,ప్రజల తిరుగుబాటు తప్పదని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ లోని శిల్పకళ బిల్డింగ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సిపిఎం పార్టీ ఆక్సిలరీ శాఖల కమిటీ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు కార్మికులపై నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి రైతులను,కార్మికులను మోసం చేసిందని,దేశ సంపద సుమారు 70 సంవత్సరాల నుంచి సంపాదించిన లక్షల కోట్ల ఆస్తిని ఏడు సంవత్సరాల బిజెపి పాలనలో పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పచెప్తూ పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ నిత్యవసర ధరలు పెరుగుదలతో ప్రజలను అతలాకుతలం చేశారని అన్నారు.

కేంద్రంలో బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తూ వస్తుందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేక అనేకమంది అనేక రుపాలలో ఆందోళనలు చేసినా ఇంతవరకు సొంతింటి కల నెరవేరలేదని,ఇప్పుడైనా డబల్ బెడ్ రూమ్ అర్హులైన వారికి ఇచ్చి ఆదుకోవాలని,బిల్డింగ్ పనిచేసే కార్మికులకి 7500 ఇస్తామని ప్రభుత్వం కరోనా సమయంలో ప్రకటించింది ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శీలం వేణు,యు.నాగరాజు,వెంకన్న,రాకేష్,నరేష్, తమ్మిశెట్టి రాములు,ఎస్ కే ముస్తఫా,రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సర్వే టెల్స్:75 దేశాల్లో అశాంతి అందులో భారత్

Satyam NEWS

కల్వకుర్తి దేవాలయాల్లో కిటకిటలాడిన భక్తజనం

Satyam NEWS

స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు

Bhavani

Leave a Comment