39.2 C
Hyderabad
April 25, 2024 15: 55 PM
Slider ప్రత్యేకం

గుస్సాడి డాన్స్ కు జాతీయ స్థాయి గుర్తింపుపై గోండుల హర్షం

#GussadiDance

అదివాసుల సాంప్రదాయ నృత్యం గుస్సాడి డాన్స్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుక వచ్చిన గుస్సాడి నృత్య శిక్షకుడు కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల గోండు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన 63 సంవత్సరాల ప్రముఖ గుస్సాడి నృత్య శిక్షకుడు కనకరాజు గడిచిన 40 సంవత్సరాలుగా వేల మందికి గుస్సాడి నృత్యం లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో  గుర్తింపు తీసుక రావడం లో విశేష కృషి చేశారు.

 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న యువకులు గుస్సాడి నృత్యం నేర్చుకోవడం లో కీలక పాత్ర పోషించారు. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ముందు గుస్సాడి నృత్యం ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు లలో తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్క కనకరాజు ను మాత్రమే  పద్మశ్రీ  వరించడం పట్ల గోండు ఆదివాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమ సంస్కృతిని తెలియజేసే సాంప్రదాయ నృత్యం ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల కనకరాజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనకరాజు మాట్లాడుతు దేశంలో అదివాసుల కళకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు గా తెలిపారు.

Related posts

చదివేది ఇంజనీరింగ్ చేసేది చోరీలు

Bhavani

ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడిపై వేధింపుల కేసు

Satyam NEWS

కొల్లాపూర్ పాలిటిక్స్: టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జగదీశ్వర్ రావు

Satyam NEWS

Leave a Comment