22.2 C
Hyderabad
December 10, 2024 11: 25 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఐ.టి.ఐ అప్రెంటీస్ లకు జాబ్ మేళా

pjimage (4)

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్  ఖాళీల భర్తీకి సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు  జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకులు ఎ.వేంకటేశ్వర రావు తెలిపారు. రిలయన్స్ జియో ఇన్ఫోకాం లో జియో గిగా ఫైబర్ ఇన్ స్తలేషన్ మరియు సర్వీసెస్ లో అసిస్టెంట్ టెక్నీషియన్స్ గా పనిచేయడానికి ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్ధులు నగరంలోని రామాంతపూర్ లో గల  జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగే జాబ్ మేళాకు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంగణంలో జరిగే ఈ జాబ్ మేళాలో రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఐ.టి.ఐ తో పాటు అప్రెంటీస్ చేసిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని వేంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐ.టి.ఐ లో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్,  ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సి.ఐ.టి.ఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళా కు హాజరుకావచ్చు అని సంస్థ రీజినల్ డైరక్టర్ ఎ.వేంకటేశ్వర రావు తెలిపారు. స్కిల్ ఇండియా లో  భాగంగా డైరక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ విభాగం పలు నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పలు రంగాలకు సంభంధించి ఆయా కంపెనీలకు అవసరమైన అభ్యర్ధులకు సరైన శిక్షణ ఇచ్చి నైపుణ్యాల మెరుగుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వేంకటేశ్వర రావు ఈ సందర్భంగా తెలిపారు.

Related posts

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS

డ్రైనేజీ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment