నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. టీజర్, ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో.. నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ”పది సంవత్సరాలక్రితం వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతోలవ్‌లోనే ఉన్నాను. మనోళ్ల్లు పాటలకి అబ్రాడ్ వెళ్తుంటారు కానీ ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడుంటుంది చెప్పండి?. ‘అష్టాచెమ్మా’ కి మూడు రోజుల ముందు ప్రీమియర్ షో ఇక్కడే జరిగింది. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు పూర్తి అయింది . మళ్ళీ ‘గ్యాంగ్‌లీడర్’ కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.
ఇంక 11 సంవత్సరాలు సేఫ్. సెప్టెంబర్ 13 నుండివైజాగ్‌లో ఏ థియేటర్స్‌లో టికెట్స్ దొరకకుండా చూసుకునే భాద్యత మీదే. ‘మనం’ తరువాత మేము ఒక సినిమా చేద్దాం అనుకున్నాం అది ‘గ్యాంగ్‌లీడర్ ‘తో కుదిరింది. అలాగే మైత్రి మూవీస్ ఎంతో ఫ్యాషనేట్‌గా ఈ సినిమాను సపోర్ట్ చేసిఎంకరేజ్ చేశారు. సెప్టెంబర్ 13న వారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీ మా సినిమా రైటర్. అతన్ని విక్రమ్ దగ్గరకు పంపింది నేనే. రేపు థియేటర్స్‌లో మీరు తప్పకుండా నవ్వుకుంటారు. అనంత్ శ్రీరామ్ గారు చాలా అందంగా పాటలు రాశారు. అనిరుద్ ఆల్రెడీ ప్రపంచాన్ని ఊపేసాడు. అతనితో ఎప్పటికైనా ఒక మూవీ చేయాలనుకున్నాను.
కానీ ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తానని అనుకోలేదు. ‘జెర్సీ’ నా కెరీర్ లోనే ఒక స్పెషల్ మూవీ. ఇప్పుడు మా కాంబినేషన్‌లో ‘గ్యాంగ్‌లీడర్ ‘మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. మంచి సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రియాంక మంచి పెర్ఫార్మర్. అలాగే లక్ష్మి గారు, శరణ్య గారి కామెడీ టైమింగ్‌కి మీరు ఫిదా అవుతారు. కార్తికేయ చాలా హుంబుల్‌గా ఉంటారు. సెప్టెంబర్ 13 తరువాత అందరూ దేవ్ అని పిలుస్తారు. కూబా అందర్నీ లడ్డులా చూపించాడు. మా ఈ సెలబ్రేషన్‌లో ఇంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిన అందరికి థాంక్స్. మళ్ళీ సక్సెస్ సెలెబ్రేెషన్స్‌లో కలుద్దాం ‘అన్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు.
ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్, స్టిల్స్: జి.నారాయణరావు, కో-డైరెక్టర్: కె.సదాశివరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.