27.7 C
Hyderabad
March 29, 2024 03: 24 AM
Slider ఆదిలాబాద్

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఐకె రెడ్డి

#MinisterIKReddy

నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీతో కలిసి ప్రారంభించారు.

అనంతరం వనం ఆవరణలో పంచ మొక్క( రాగి మర్రి, జువ్వి, వేప,పత్రి ) నాటి ప్రకృతి వనాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 552 పల్లె ప్రకృతి వనాలను 100 % పూర్తి చేశామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం లో 12720 వేలకు పైగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం పచ్చదనం లో 33% దాటిందని భవిష్యత్ లో 40% పచ్చదనాన్ని చేరువవుతామని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితీ కి 10% నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోలం సవిత కృష్ణ, మండల ఎంపిపి ఎలాల అమృత చిన్న రెడ్డి, PD DRDA వెంకటేశ్వర్ రావు, జడ్పి కో ఆప్షన్ సుభాష్ రావు, పార్టీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, PACS డైరెక్టర్ రమణ రెడ్డి, రైస మండల అధ్యక్షుడు కోడె రాజేశ్వర్,ఎంపిటిసి అక్షర అనిల్, నాయకులు దనే రవి,విడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేరేచర్ల లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Satyam NEWS

బిచ్కుంద సీఐ ఎస్సైలను కలిసిన బీఎస్పీ దండోరా నాయకులు

Satyam NEWS

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు చర్చలు జరపాలి

Satyam NEWS

Leave a Comment