33.2 C
Hyderabad
April 26, 2024 01: 03 AM
Slider ఆధ్యాత్మికం

దేవీ శ‌ర‌న్న‌వరాత్రుల సంద‌ర్బంగా ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనం…!

#devinavaratri

ప్ర‌తీ ఒక్క‌రిలో ఉన్న శ‌క్తిని తెలుసుకోవ‌డ‌మే ముఖ్యం

ఏపీ రాష్ట్ర‌మంత‌టా వాడ‌వాడ‌లా…దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రులు సాదాసీదాగా జ‌రుగుతున్నాయి. క‌రోనా ప్ర‌భాం త‌గ్గిన‌ప్ప‌టికీ చాలా మందిలో భ‌యం కాస్త స‌డిలినా…ఆధ్యాత్మ‌కంగా మాత్రం ప్ర‌తీ ఒక్క‌రూ ఈ  దేవీశ‌ర‌న్న‌రాత్రులు పుణ్య‌మా భ‌క్తిపార‌వ‌శ్యంలో ఉంటున్నారు.

అక్క‌డ‌క్క‌డ‌….నామ‌మాత్రంగా గుంపులు..గుంపులులా కాకుండా మామూలుగా శ‌ర‌న్న‌వ‌రాత్రులు జ‌రుగుతున్నాయి.అందులోబాగంగానే విజ‌య‌న‌గ‌రంలో భారీఎత్తున కాకుండా కేవ‌లం…ఎవ‌రి ఇండ్ల‌లో వారు శ‌ర‌న్న‌వ‌రాత్రులు జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ..ప్ర‌ముఖ సంస్థ‌లు…క్ల‌బ్ ల‌లో ఆధ్యాత్మిక‌ప్ర‌సంగాలు నిర్వ‌హిస్తున్నారు…ఆయా కేంద్రాల నిర్వాహ‌కులు.

ఈ నేప‌ధ్యంలో  లేడీస్ రిక్రియేష‌న్ క్ల‌బ్..ప్ర‌తీ  ఏటా మాదిరిగానే ఈ ఏడు కూడా న‌గ‌రంలోని ఆనందగ‌జ‌ప‌తి ఆడిటోరియంలో ప్ర‌ముఖ ఆధ్యాత్మికి ప్ర‌సంగురాలు సుశీల గారి చే అనుగ్ర‌హ భాష‌ణం చేయించింది…లేడీసీ రిక్రియేష‌న్ క్ల‌బ్. ఓంకారం  అనే ప్ర‌ణ‌వ నాదంతోసృష్టి ప్రారంభ‌మైంద‌ని…అలా ఉచ్ఛ‌రించిన ధ్వ‌ని,శ‌బ్దం వెన‌క  ప్ర‌తీ ఒక్క‌రిలో అతీత‌మైన శ‌క్తి ఉంద‌ని దాన్నే తెలుసుకోవాల‌న్నారు.

ప్ర‌తీ ఒక్కరూ ఎప్పుడు పుడతారో…ఎప్పుడు ఈ కాల‌గ‌ర్బంలో క‌లుస్తారో చెప్ప‌లేమ‌ని…ఉన్నంతలో మ‌న‌లో నిగూఢమైన శ‌క్తిని తెలుసుకోవ‌డ‌మే మ‌నంద‌రి ల‌క్ష్య‌మ‌న్నారు. ఆ శ‌క్తి ని తెల‌సుకోవాలంటే మొట్ట‌మొద‌టి మెట్టు..భ‌క్తి  అని దాన్ని ఏవిధంగానైనా ఆరాధించ‌వ‌చ్చ‌ని తద్వారానే ప్ర‌తీ ఒక్క‌రిలో స‌మ‌భావన ఏర్ప‌డి…నువ్వు,నేను  అన్న తేడా లేకుండా చూడ‌టం జుగుతుంద‌ని అది సాధ‌న ద్వారానే ల‌భిస్తుంద‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకురాలు సుశీల సెల‌విచ్చారు.

ఈ కార్య‌క్ర‌మం దాదాపు  గంట‌న్న‌ర సేపు జ‌రుగ‌గా…ఇందులో  ప్ర‌ముఖ నాట్యాచార‌ణి సౌమ్య‌..అలాగే 104 ఉద్యోగస్థురాలు సౌజ‌న్య‌..అలాగే స‌న్యాసిరావు…లేడీస్ రిక్రియేష‌న్ క్ల‌బ్ నిర్వాహ‌కురాలు  పాల్గొన్నారు.అంత‌కు ముందు క్ల‌బ్ లోశ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా అమ్మవారి పూజ వైభోవోపేతంగా జ‌రిగింది.

Related posts

150 ట్రాక్టర్ల గ్రాసం అందజేత

Bhavani

Analysis: బలం ఎక్కువ బుద్ధి తక్కువ

Satyam NEWS

Un Lock 3.0: సినిమా ధియేటర్లకు పర్మిషన్ నో

Satyam NEWS

Leave a Comment